Categories
-డి. సుజాతాదేవి
సెట్టు కొమ్మలమీది
సిలకల్ల జంటల్లె
మల్లి నువ్వూ నేను
మారిపోదామె
మారిపోదామె ||
ఇల్లేటొ పల్లేటొ
పోలమేటటొ పుట్టేటొ
నట్టేట ఉన్నట్టె
కొట్టుకుంటది మణుసు ||
కోకోటి రైకోటి
కొప్పులో పువ్వోటి
ముక్కునా నత్తోటీ
మురిపాల నవ్వో టి ||
ఆకుపచ్చని కోక
అడిగి పుట్టెను సిలక
పొలమెళ్ళ పనిలేదు
పళ్ళు బోయినమె ||