కీళ్ళకు ఎముకలకు సంబంధించి ఎన్నేన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణంగా మోకాళ్ళ సమస్యలు ఉంటే పరుగుల జోలికి పోరు. కానీ ఒక కొత్త పరిశోధన పరుగులతో మోకాళ్ళకి కొత్త బలం వస్తుందని నిరూపించింది. ఈ పరిశోధనలో కొంత మందికి అరగంట పాటు పరుగెత్తేలా చేశారు. పరుగులకు ముందు తర్వాత మోకాళ్ళ దగ్గర జరుగుతున్నుది పరీక్షిస్తే వాపు సమయంలో కనిపించే సైటోకైన్స్ అనే రసాయనం పరుగు తర్వాత తగ్గిపోటాన్ని గమనించారు. భవిష్యత్తు లో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే పరుగుని ఓ మందులా భావించమంటున్నారు.

Leave a comment