గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు,కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకొంటున్నవాళ్ళు,ఆందోళన,ఆదుర్దాతో సతమతం అయ్యేవాళ్ళు  యానిమల్ థెరపీ తో కోలుకొంటారు అంటున్నారు అధ్యయనకారులు దీన్నే పెటో థెరపీ అంటున్నారు. కుక్కలు, గుర్రాలు,కుందేళ్ళు,పక్షులు,డాల్ఫిన్ లు, చేపల్ని కూడా ఈ థెరపీ కోసం ఉపయోగిస్తారు. అన్నింటిలో బర్డ్ థెరపీ అత్యంత శక్తివంతమైంది అంటున్నారు. రోగి మానసిక శారీరక స్వాంతన కు కుందేళ్లు సాయపడతాయి. భావోద్వేగాల నియంత్రణలో హార్స్ థెరపీ కి మించినది ఇంకొకటి లేదు. శునకాలతో సొంత పిల్లల తో ఉన్న ఫీలింగ్ వస్తుంది అంటున్నారు.

Leave a comment