నెట్ ఫ్లిక్స్ లో జనవరి 7న విడుదలైన వెంటనే అత్యధిక వ్యూయర్ షిప్ పొందిన సినిమా చండీగఢ్ కరే ఆషికీ ఇది ట్రాన్స్ గర్ల్ లవ్ స్టోరీ. చండీగఢ్ లో ఒక దివాలా తీసిన జిమ్ నడుపుతూ ఉంటాడు ఆయుష్మాన్ ఖురానా. ఆ జిమ్ కు జుంబా ఇన్ స్ట్రక్టర్ గా వాణి కపూర్ వస్తుంది. ఆమె రాకతో జిమ్ కు మళ్లీ గిరాకి వస్తుంది. ఆయుష్మాన్, వాణీకపూర్ లు ప్రేమలోపడి శారీరక సంబంధం వరకు వెళ్తారు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన వచ్చినపుడు తను అబ్బాయిగా పుట్టానని అమ్మాయిగా మారిన ట్రాన్స్ గర్ల్ ని అంటుంది వాణీకపూర్. ఆమెను విపరీతంగా ద్వేషిస్తాడు హీరో తర్వాత నెమ్మదిగా ట్రాన్స్ జెండర్ గురించి అవస్థగా గుర్తిస్తాడు అన్ని జండర్ లను సమాజంలో అంతర్భాగం చేసుకోవాలనే సందేశం ఇచ్చేందుకే ఈ సినిమా తీశారు తప్పకుండా చూడవలసిన సినిమా ఇది.

Leave a comment