Categories
ఈ వర్షాలు కురిసే సమయంలో ఒక్కసారి మొహం జిడ్డుగా లేదా పొడిబారి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.వీటిని పెరుగుతో దూరం చెయచ్చు.బాగా పండిన స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని స్పూన్ పెరుగు వేసి బ్లండర్ తో కలపాలి.ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి పెరుగులో శనగపిండిని, టమోటో రసం కలిపి దాన్ని మొహానికి పట్టించి సవ్య అపసవ్య దిశలో మర్దనా చేసి తర్వాత చల్లని నీళ్ళతో మొహం కడుక్కోవాలి. రెండు టేబుల్ స్పూన్ పెరుగు లో రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి దీన్ని మొహానికి మెడకు రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి.పెరుగులో ఆలివ్ ఆయిల్ కలిపి మెడ మొహానికి పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే మొహం మెత్తగా ఉంటుంది.మొటిమలు కూడా పోతాయి.