Categories
మన చుట్టు ఉండే సమాజంలో సన్నిహిత సంబంధాలు,కళలు ,క్రాఫ్ట్ కార్యకలాపాల్లో నిమగ్నమై ప్రతి నిమిషం ఉత్సహాంతో గడిపే వృద్ధులకు జ్ఞాపక శక్తి సంబంధిత సమస్యలు బాగా తగ్గుతాయని అధ్యయనాలు చెపుతున్నాయి. అదే ఒంటిరి తనంతో ఉండే వాళ్ళలో సమస్యలు పెరిగి డెన్షియాకు దారి తీస్తాయి. వారే డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళల్లో శ్రద్ధగా మనసు లగ్నం చేస్తే ఈ సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. ఈ కళాత్మాక కార్యకలాపాల పట్ల అంతగా శ్రద్ధ చూపకుండా నిర్లిప్తంగా ఉంటేనే మతి మరుపు భారీన పడుతున్నట్లు గుర్తించారు.