వేసవి వస్తే పండ్ల సందడి మొదలవుతోంది. మార్కెట్ నిండా పండ్లే.ఒక కప్పు గుమ్మడికాయ గుజ్జులో కోడిగుడ్డు బ్లండ్ చేసి ఆ మిశ్రమంతో ఫ్యాక్ వేస్తే ఇది చర్మాన్ని కాంతివంతంగా చేసేస్తుంది.నిమ్మ,నారింజ రసాల్లో కూడా కోడిగుడ్డు,గుడ్డు తెల్లసొన కలిపి ఫ్యాక్ వేస్తే చాలు ముఖం మెరిసిపోతుంది. ఇక క్యారెట్ రసంతో ప్యాక్ వేస్తే మచ్చలు మరకలుపోతాయి. ద్రాక్షపండు చిదిమి ఆ గుజ్జుతో నిమ్మరసం ,గుడ్డుపొన ప్యాక్ వేస్తే చాలు .ఇది ఆయిలీ స్కిన్ కు చక్కని ప్యాక్. డ్రైస్కిన్ అయితే ఈ ద్రాక్ష గుజ్జులో నిమ్మరసం తేనే వెజిటేబుల్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. పండిన అరటి పండు ప్యాక్ అయితే ముఖం మెరుపు నునుపు వచ్చేస్తుంది. ఏ ఫ్రూట్స్ తో ప్యాక్ చేసినా ముఖంపై మచ్చలు పోయి ప్రకాశంతవంతంగా ఉంటుంది.

Leave a comment