Categories
ఈ చలికాలపు సమస్యల్లో జుట్టు ఎందిపోయి తల పొడిబారిపోయి దురద పెట్టడం. ఈ సీజన్ లో కొబ్బరి నూనె వాడితే మంచిది. 2 రోజులకు ఒక్సారి ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె, నిమ్మరసం అన్నింటిని కలిపి గోరు వెచ్చగా చేసి తలకు పట్టించాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసి తలస్నానం చేయవచ్చు. అలాగే గుడ్డు తెల్ల సొనలో తేనె నిమ్మరసం కలిపి తలంతా రాసుకుని అది ఆరిపోయే దాక వదిలేసి గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేసిన జుట్టు పట్టులా మెరుస్తుంది. అలాగే బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.