Categories
జుట్టు వత్తుగా పెరగాలని ,ఆరోగ్యంగా మిలమిల లాడి పోతూ కనిపించాలని అందరికీ కోరికే. ఖరీదైన హెయిర్ ఆయిల్స్ ని మించినవి కొబ్బరి పాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి పాలలో సమృద్దిగా ఉండే నియాసిన్ ఫాలెట్లు వంటివి మాడుపైన రక్త ప్రసారాన్నిపెంచుతాయి. విటమిన్ ఇ వంటి కొవ్వులు జుట్టు పాడవ్వకుండా కండీషనర్ గా పనిచేస్తాయి. కొబ్బరిని మొత్తగా రుబ్బి గట్టిగా పిండి చిక్కని పాలు తీసుకోవాలి. వాటిని అప్పటికప్పుడు జుట్టుకు పట్టించి ఓ గంటసేపు అలా వదిలేసి తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిగా అయిపోయి జుట్టు పెరుగుతుంది కూడా. అలాగే ఈ పాలల్లో అలోవేరా గుజ్జు ,పెరుగు కలిపి జుట్టుకు పట్టించినా మంచిదే.