“నిత్యానందకరి వరా భయకరి…
         సౌందర్య రత్నాకరి”…
ఆదిలాబాద్ జిల్లాలోని, నిర్మల్ కు సమీపంలో గల అన్నపూర్ణ సమేతుడై  కదిలి పాపహరేశ్వరుడి మహిమలు చెప్పుకుందామా!!
జమదగ్ని మహర్షి తనయుడు పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని చరిత్ర చెబుతోంది.నూటోక్క శివలింగాలలో కదిలి శివయ్య నూటఒకటో లింగం.కాశీలో శివుడు దక్షిణ ముఖాన దర్శనం ఇచ్చినట్లే కదిలి శివుడు కూడా దక్షిణ ముఖాన చూడవచ్చు.నందీశ్వరుని చెవుల్లో ఓంకారం వినిపిస్తుంది.ఈ క్షేత్రంలో బ్రహ్మ, హయగ్రీవుడు,వినాయకుడు మనకు దర్శనం ఇస్తారు.
పరశురాముని భక్తికి శృంగి-భృంగిలు నృత్యం చెయ్యడం చూస్తూంటే శివయ్య ఆనందంతో తాండవం చేయగా ఇక్కడ లింగం
కదిలింది అని అందుకే ఈ ప్రదేశానికి కదిలి అని పేరు గాంచినది.అన్నపూర్ణ దేవికి మొక్కుకున్న సంతానం కలుగుతుంది.ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసిన క్షయ మొదలగు వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

ఇష్టమైన రంగుల: తెలుపు
ఇష్టమైన పూలు: మారేడు దళాలు,బిల్వపత్రం
ఇష్టమైన పూజలు: పంచామృతాభిషేకం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు, అన్నంపాయసం.
అన్నంపాయసం తయారీ: ముందుగా పాలు మరిగించి అందులో కడిగిన బియ్యం వేసి ఉడికించి తగినంత బెల్లం వేసి ఉడికించి చివరికి వేయించిన జీడిపప్పు వేసి అన్నపూర్ణ సమేతుడై కదిలి పాపహరుడికి ప్రసాదం పెట్టాలి.

         -తోలేటి వెంకట శిరీష

Leave a comment