కాకరకాయ ఎలా తిన్నా మంచిదే. చేదు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యం, వేపుడు కూర చేస్తే చేదు అని తినలేని వాళ్ళు ఇలా పచ్చడి చేసి చూడండి. ఇది చేదు లేకుండా పుల్లగా తీయగా రుచిగా ఉంటుంది. 1 కిలో కాకరకాయ, 180 గ్రాముల పచ్చి మిర్చి రుచికి సరిపడ ఉప్పు కారం పెద్ద కొలతలు అక్కర్లేదు సరిపడినంత పది నిమ్మకాయల రసం, 500 ఎం.ఎల్ నూనె, 30 గ్రాముల పసుపు,40 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు ,10 గ్రాముల ఇంగువ ,పది గ్రాముల చెక్కర కాకరకాయలు కడిగి ఆరనిచ్చి మధ్యలో గింజలు తీసేసి చిన్న అంగుళం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇంగువ నూనె మిగతా అన్ని కలిపేసుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ వేసి ముక్కల్లో పోసి బాగా కలియబెట్టి పొడిగా ఉన్న సీసాలో పోసేసి మూత పెట్టేస్తే పచ్చడి రెడి. రెండు రోజులు అలా ఉంచేసి తర్వాత తినవచ్చు.చేదు ఉండదు బావుంటుంది.
Categories