ఇంట్లోనే మానిక్యూర్ చేసుకుంటే ఇటు సమయం అటు ఖర్చు రెండు తప్పుతాయి. ముందుగా గోళ్ళ పై ఉన్న నెయిల్ పెయింట్ రిమూవ్ చేయాలి. నీళ్ళలో రెండు చేతులు ముంచి కాసేపు ఉంచాలి. స్క్రబ్ చేసి మృత కణాలు తొలగించుకోవాలి. బేబీ అయిల్ లో కాస్త పంచదార వేసి స్క్రబ్ చేసినా బాగా పని చేస్తుంది. నెమ్మదిగా గోటి వెంబడి ఉండే చర్మాన్ని మృదువుగా మలుచుకోవాలి. దూది ని నూనెలో ముంచి మాసాజ్ చేయాలి. ఆరెంజ్ ఉడ్ స్టిక్ తో క్యూటికల్స్ ని ముందుకు తోస్తున్నట్లు క్లీన్ చేస్తే చక్కని ఆకృతి వస్తుంది. గోళ్ళు చక్కగా కట్ చేసి గరుకు లేకుండా నెయిల్ కట్టర్ తో సరి చేసుకోవాలి. ఇప్పుడు చేతులకు కూడా హ్యాండ్ మాస్కులు వస్తున్నాయి. పోషకాలు తేమ అందే మాస్క్ ఎంచుకుని చేతులకు వేసుకుంటె చాలు. పది నిమిషాల తర్వాత ఈ మాస్క్ తీసేస్తే చేతులు ఎంతో చక్కగా మృదువుగా ఉంటాయి. అస్తమానం పనులతో అలిసిపోయే చేతుల మీద ఆ మాత్రం శ్రద్ద చూపాలి.

Leave a comment