Categories
వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో కాళ్ళ నొప్పులు అన్న ఫిర్యాదు చాలా మంది చేస్తూ ఉంటారు. అవి తక్కువ స్థాయి నుంచి భరించలేనంత వరకు ఉంటాయి. నడవనివ్వకుండా ఇబ్బంది పెడుతాయి. కండరాలు పట్టేయటం కండరాల అలసట ఎక్కువసేపు నిలబడటం పోషకాహార లోపం వంటివి కొందరిలో కాళ్ళ నొప్పులకు కారణాలు కావచ్చు. కండరంలోని శిరలలో రక్త ప్రవహ లోపం ,కీళ్ళ నొప్పులు ,అతి నడక వల్ల నాడులు దెబ్బ తినటం కూడా కారణాలు కావచ్చు. కొన్ని నొప్పులు విశ్రాంతితో సర్ధుకుంటాయి. రెండు పైన కాళ్ళు పెట్టుకొంటే తగ్గుతాయి. మర్ధన చేస్తేనూ ,వేడి నీళ్ళ కాపటం వల్లనూ ఐస్ తో కాపడం వల్లనూ నొప్పులు సర్ధుకోవచ్చు.డి విటమిన్ లోపం కూడా కండరాల నొప్పులకు కారణం కావచ్చు.