ఈ చలికాలంలో కాళ్ళు పగలటం అందరి సమస్య. ఆ పగుళ్ళు ఒక్కసారి రక్తాలు కారేలా ఎక్కువవుతాయి కూడా. పాదాలను శుభ్రంగా కడిగి ,పెట్రోలియం జెల్లీ రాసి ఆరిపోకుండా వెంటనే సాక్స్ వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందర ఇలా చేస్తే చాలు రెండు మూడు రోజుల్లోనే పగుళ్ళు తగ్గుతాయి. కాళ్ళే కాదు చేతిగోళ్ళు ,మోచేతులు,మోకాళ్ళు పగిలి ఒకరకంగా అయిపోతాయి.వీటికీ స్నానం చేయగానే వళ్ళు తడి ఆరిపోకుండా ముందుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పగుళ్లు ఎక్కువగా అనిపిస్తే వెంటనే పెట్రోలియం జెల్లీని కూడా అప్లైయ్ చేస్తే ముందు చర్మం మెత్తబడి పోతుంది. తాజాగా అనిపిస్తుంది. స్నానం చేసే నీళ్ళలో కాస్త ఫ్యూర్ లవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కలిపి స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. మామూలు కొబ్బరి నూనె కూడా శరీరాన్ని పొడి భారనీయదు.
Categories