ఒక్కసారి ఇంటి తాళం చెవులు కుడా ఎక్కడ పెట్టామో గుర్తురాదు. చిన్ని చిన్ని అవసరమైన వస్తువులు ఒక పట్టాన ఎంత వెతికినా దొరకవు. అలాగే ఎవరో వచ్చి చిరునవ్వులతో పలకరిస్తారు. ఎంత ఆలోచించినా వారెవరో వెంటనే చెప్పలేకపోవడం అలా చాలా సార్లు జరిగితే, మతిమరుపు వస్తున్నాదని టెన్షన్ పడిపోతాం. ఇక్కడో చిట్కా చెప్పారు వైద్యులు అలా మరచిపోయినవి స్పూరణకు రావాలంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని కళ్ళను అటు ఇటు కదిలించాలి అలా చేస్తే మరచి పోయిన వస్తువు గానీ, గుర్తు పెట్టలేకపోయినా పేరు గానీ వెంటనే గుర్తు వస్తుందని డాక్టర్లు చెప్పుతున్నారు. కళ్ళను అలా కుడు ఎడమలకు తిప్పితే మెదడు లోని రెండు అర్ధ భాగాలు ఒకదానితో మరొకటి కాలిసి పనిచేయడం మొదలు పెట్టి మరుగు పెట్టిన జ్ఞాపాలను వెలికి తీస్తాయంటున్నారు తప్పేముంది ట్రై చేస్తే పోలా!
Categories