Categories
ట్రీ హౌస్ పేరుతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో కొన్ని వేల మందికి సహజ రంగుల తయారీపై శిక్షణ ఇస్తోంది మన్య చెరబుద్ది. పిల్లలకు వాడే దుస్తులపై కల్తీ రంగుల వాడకం ప్రమాదం కనుక సహజ రంగులతో డై చేయమని చెబుతోంది మన్య. ఆకులు, పువ్వులు, కూరగాయలు,పండ్ల తోనే సహజమైన రంగులు ఎలా తయారు చేసుకోవాలో ట్రీ హౌస్ లో పాఠాలు చెబుతోంది. ఈ ఆన్ లైన్ వర్క్ షాప్ లో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఆమె దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది సొంత వ్యాపారాల్లో ఉన్నారు.