Categories
WhatsApp

కర్పూరం వెలిగిస్తే వాసన పరార్.

వేసవి సెలవులకు పిల్లలు అందరు ఊరు వెళతారు. అయితే ఊరికి వెళ్ళే ముందర, ఫ్రిజ్ లో కిచెన్ లో అన్నీ ఖాళీ  చేసి మిగిలినవి అవతల పారేసి ఇంటి తలుపులు జాగ్రత్తగా వేస్తే చాలు…. అదోరకమైన  వాసన వస్తుంది. ఇల్లు వాకిలి క్లీన్ చేసుకున్నా రెండు రోజుల పాటు ఆ వాసన వదలదు. ఇక ఏదన్నా అలర్జీ వుంటే వాసన నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఆ ఇబ్బంది నుంచి బయట పడాలంటే ఇంటికి తాళం తీసిన వెంటనే తలుపులు కిటికీలు తెరిచి పెట్టాలి. కిటికీలకు వాకిళ్ళకు వేసిన కర్టెన్ లు వీలైతే వుతికేయాలి. లేదా పక్కకు లాగేయాలి. గాలీ వెలుతురు ధారాళంగా వచ్చేలా చేసి ఆ తర్వాత ఓ ప్లేట్ లో కర్పూరం వెలిగించి అన్ని  గదుల్లోనూ తిప్పితే ఆ వాసన పోతుంది. దూప్ స్టిక్ వెలిగించి అన్ని గదుల్లో తిప్పాలి. లేదా గదిలో స్టిక్ వెలిగించి పెట్టాలి. ఊరికి వెళ్ళే ముందర పుదీనా రసం తీసి అందులో దుది ముంచి తడిపి ఇంట్లో అక్కడక్కడా పడేస్తే ఏ క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి.

Leave a comment