నీహారికా, ఎవరిరైనా సరే చిన్నపాటి తప్పు చేయకుండా రోజు గడవదు. కానీ అలాంటి చిన్న తప్పు చేశామని తెలిసీ ఎవరికైనా ఎలా తెలుస్తుందిలే అని సరిపెట్టుకుంటాం. కానీ ఇదే అలవాటైపోతే ఇదే ఒక ఆఫీస్ అయితే, ఆ ఆఫీస్ జీవితం మన కెరీర్ అయితే, ఒక తప్పు జరిగితే దాన్ని పై అధికారికి వెంటనే చెప్పటం వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. మనం మన బాస్ కంటే తెలివైన వాళ్ళం అనుకుంటాం. కానీ బాస్ స్థానంలో ఉన్న వ్యక్తి మనకంటే విద్య, అనుభవంలో ఎక్కువవాడే అయివుంటాడు. అతనితో చిన్నపాటి తప్పులు చెప్పుకుంటే కెరీర్ కు నష్టమేమో అనుకుంటాం. కానీ అవే మన కెరీర్ ని పాడు చేయొచ్చు కూడా. అలాగే వ్యక్తిగతంగా తీసుకొంటాం. ఇంట్లోనే మనవల్ల చిన్న పొరపాటు జరిగిందనుకో దాన్ని దాచిపెట్టకుండా పెద్దవాళ్ళ వరకూ తీసుకుపోవాలి. ఆ నిమిషంలో తప్పు చేసినందుకు ఎవరైనా కోపం తెచ్చుకోవచ్చు. కానీ మీలోని నిజాయితీ మటుకు అందరికి తెలుస్తుంది. నిజాయితీ అన్నది మనిషికి అలంకరించుకోని నగలాంటిది. ఒక పరిమళం వంటిది. ఆ నిజాయితీ మనల్ని ఎన్నో మెట్లు ఎక్కిస్తుంది, సందేహం లేదు.
Categories