“ప్రభుం ప్రాణనాథం..విభుం విశ్వ నాధం
జగన్నాథ నాధం……సదా నంద భాజం”!!
సఖులు!! ఈ రోజు మనం హైదరాబాద్ కిషన్బాగ్ లో ఉన్న కాశీ బుగ్గేశ్వరుడి కి ప్రసాదం చేద్దాం రండి!!
మూసీ నది తీరాన కొలువున్న కాశీ బుగ్గ దేవాలయం లో శివ లింగ దర్శనం ఎన్నో జన్మల పుణ్యం.ఆలయాన్ని మఠం లాగా నిర్మించారు.ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఇక్కడ భక్తులు పూజించి శివయ్య అనుగ్రహానికి పాత్రులవుతారు.గంగమ్మ తల్లి తనకై తానుగా ప్రవహిస్తూ లింగమూర్తి కి నిరంతరం అభిషేకం చేస్తూనే వుంది.
కాశీ బుగ్గేశ్వరుడు కి స్వయంగా భక్తులు పూజించి తరించవచ్చు.సోమవారం నాడు మాత్రం భక్తులు పూజలు వీక్షించడానికే కానీ స్వయంగా పాటించడానికి అనుమతించరు.ఈ దేవాలయం లోని విశేషం సర్పాలు వచ్చి శివయ్యను ఆలింగనం చేసుకోవటం చూసిన ముగ్థులమై పోతాము.ఎవరికి హాని కలిగించవు.నారద మహర్షి, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇస్తారు.కాశీ బుగ్గేశ్వరుడు మనకు ఎల్లప్పుడూ రక్షణ కల్పించే విధంగా ఆలోచింప చేస్తాడు.
ఈ కట్టడం చాలా పురాతన కాలంలోనిది.
చాలా శక్తిమంతమైనది.
ఇష్టమైన పూలు: మారేడు దళాలు,తెల్ల గన్నేరు.
ఇష్టమైన పూజలు: పంచామ్రుతాభిషేకం,జలాభిషేకం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,బియ్యంరవ్వ తో చేసిన పిండి.
తయారీ విధానం: ముందు రోజు బియ్యం కడిగి నీడలో ఆరబెట్టాలి.ఉదయం గ్రైండ్ చేసుకోవాలి. మేత్తగా,రవ్వ తయారు చేసికొని పెట్టుకోవాలి. ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాసు నీళ్ళు. మూకుడు పెట్టి నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర,ఎండు మిరపకాయలు వేసి తగినంతఉప్పు వేసి కలిపి కొలతలతో నీరు,రవ్వ పోసి ఉడికించాలి.విశ్వేశ్వరుడికి పిండి నైవేద్యం తయారైంది.
-తోలేటి వెంకట శిరీష