Categories
పక్షుల సంరక్షణ పెద్ద ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం ఏమీకాదు, చిన్ని ఖర్చుతో ఇంట్లోనే పక్షుల కోసం ఏర్పాట్లు చేయవచ్చు. వెంటి లెటర్స్ దగ్గర, చెట్ల దగ్గర బాక్స్ ఆకారంలో చిన్ని పెట్టిలు, తీగతో కట్టి గూడు ఏర్పాటు చేయవచ్చు . ఈకలు ,పీచు, పువ్వుల వంటివి అందుబాటులో ఉంటే పక్షులే గూడు కట్టుకొంటాయి . సూర్య రశ్మి, వర్షం వాటిపైన మరీ ఎక్కువగా పడకుండా ఉండే చోట పక్షుల కోసం చిన్ని గూడు ఏర్పాటు చేయాలి. వాటికోసం గుప్పెడు గింజలు, మంచి నీళ్ళు పెడితే చాలు అవి గూడు వదల కుండా ఉంటాయి . నాగపూర్ లోని యశోదా షిండేషన్ జీవావరణ సమతుల్యం పై అవగాహన పెంచి దాదాపు వెయ్యి గూళ్ళు తయారు చేసి రిజిస్టర్ చేసుకొన్నా వాళ్ళకి ఇచ్చింది . ఇప్పటి వరకు రెండువేలకు పైగా గూళ్ళు ఇళ్ళలో ఉన్నాయి .