Categories
వర్షకాలంలో తడితడిగా ఉంటుంది కనుక ఈగలు,దోమలు,బొద్దింకలు ఎక్కవ కనిపిస్తాయి. రసాయనాలు నిండిన ఇన్ ఫెస్టిసైడ్ వాడితే అనారోగ్యాలు తప్పవు. ఇంట్లో తయారు చేసే ఈ మందులు విజయవంతంగా కీటకాల్నీ నిర్మూలిస్తాయి. దోమలు పోవాలంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ,యూకలిప్టస్ ఆయిల్ ,సిట్రోనెల్లా ఎసెస్షియల్ ఆయిల్ నీళ్ళు కలిపి స్ర్పేయర్ లో నింపి అవసరం అయినప్పుడు వాడుకోవాలి. దాల్చిన చెక్క వెల్లుల్లి ముక్కలు గోడ మూలన ఉంచితే చీమలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల నీళ్ళలో వేసి మరగబెట్టి ఆ నీళ్ళను కిటికి అంచులో సింకుల్లో మూలల్లో స్ర్పే చేస్తే బొద్దికలు ఆ వాసనకు పోతాయి.