ముందు లక్ష్మీ దేవి బోమ్మతో కనబడే వడ్డాణాలే ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. ఇప్పటికీ చక్కని దేవత స్వరూపాలు చెక్కిన నక్ష బంగారం వడ్డాణాలు లేటేస్ట్ ఫ్యాషనే. మాసిపోయిన డల్ ఫినిషింగ్ తో చక్కని పనితం కనిపిస్తుంది.గోల్డ్ ఫినిషింగ్ అంటే ఇలాంటి యాంటెక్ వడ్డాణాలే బావుంటాయి కూడా. అయితే కొన్నీ రకాల వడ్డాణాలు రెండు రకాలుగా వాడుకొనేలా వస్తున్నాయి. హారంలాగా ,వడ్డాణం లాగా రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇవి పూర్తి బంగారంలోనూ ,అన్ కట్ డైమాండ్స్ తో తయారు చేస్తున్నారు. ఒక చోకర్ ను తీసుకొంటే అందులో మధ్యలో ఉంటే లాకెట్ చెవి పోగులుగా అదే చోకర్ ను వడ్డాణంగానూ వాడుకోవచ్చు. అప్పుడు వడ్డాణం సింపుల్ గా ,చిన్న చిన్న ఆకేషన్స్ లో పెట్టుకొనేందుకు వీలుగా బావుంటాయి.

Leave a comment