-డి.సుజాతాదేవి

మల్లీ మా లచ్చిమీ
సీమా లచ్చిమీ!సీతాలచ్చిమీ
బండ రాముణ్ణికాదే నే నింక
బడికి ఎల్తన్నానే పిల్లా

మూతి ముడకవకే ముద్దులగుమ్మా
పగలు పాబుకు పోతానె బామ్మా
సందలడిపోగానే సదువు కెల్తన్నానే
ఏతి ముదర జాతకం ఇక తిరిగిపోయిందె!!

పినిమా పేరడగతాకి సిగ్గేత్తదే
ఉత్తర మొచ్చిందంటె ఉసూరంటదే
సిత్తరమే పిల్లా సదువెంత తేలికో
పట్టుబట్టితె ఇట్టే పట్టడిపోతున్న దే
ఆరూ తొమ్మది తేడా అర్థమయిందీ
‘ఓ’కి ఒంకరలెన్నో తెలిసిపోయింది
‘ఎ’అంటే ఎల్లెద్దు కొమ్మలాంటిదీ
‘ఐ’ని అటుతిప్పి రాస్తే ‘ణ’ ఔతదీ!!

Leave a comment