దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల రుచి వస్తుందో, లేదా అది తయారు చేసే విధానం లో ఉంటుందో తెలియదు కానీ కొన్ని ఆలయాల ప్రసాదాలు రుచితో అద్భుతంగా ఉంటాయి. ప్రసాదం అంటే మొదట గుర్తొచ్చేది తిరుమల లడ్డు శ్రీనివాసులు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో, అంత ఇష్టం తోనూ ఆ లడ్డూలు తెచ్చుకుంటారు. మొదట్లో ఈ లడ్డూ అరకిలో బరువుతో ఉండేదట ఇప్పుడు వంద గ్రాములు ఉంటోంది. అన్నవరం సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వ ప్రసాదం రుచి ఇంకెక్కడా చూడలేం. సత్యదేవుని కొలిచేందుకు వెళ్ళేవాళ్ళు ఈ ప్రసాదం అడిగి మరీ తింటారు. గోధుమ రవ్వ,నెయ్యి బెల్లం తో తయారు చేసే ఈ ప్రసాదం రుచి అద్భుతం.

బియ్యం నెయ్యి బెల్లంతో లేహ్యం లాగా ఉండే అయ్యప్ప ప్రసాదం భక్తులకు ఎంతో అపురూపం ఈ ప్రసాదానికి ఎంతో డిమాండ్ భక్తులకు పోస్ట్ లో కూడా పంపుతూ ఉంటారు నిర్వాహకులు. పళని లో దండాయుధపాణి ప్రసాదంగా ఇచ్చే పంచామృతం చాలా స్పెషల్. పళని కొండలపైన పెరిగే విరుపాచ్చి  అరటిపండ్లు, తేనె ఖర్జూరాలు నెయ్యి యాలుకలు ప్రత్యేకమైన బెల్లం పటిక బెల్లం కలిపి తయారు చేసే ఈ ఫ్రూట్ జామ్ అంటారు. రుచి చూసిన వాళ్లు ఇది మూడు నెలలు నిల్వ ఉంటుంది. స్వర్ణ దేవాలయాన్ని చూసిన వాళ్లు గోధుమ హల్వా ప్రసాదం తప్పకుండా మళ్లీ మళ్లీ అడిగి తింటారు కదా ప్రసాదం గా పిలిచే ఈ ప్రసాదం రుచి అమోఘం ఉడిపి శ్రీకృష్ణుడు ప్రసాదంగా ఇచ్చే చక్కిలం రుచి చాలా బాగుంటుంది అంటారు అక్కడ రక రకాల లడ్డూలు మురుకులు ప్రసాదంగా ఇస్తారు. దైవ ప్రసాదాలు రుచి దేవుడి స్పర్శతో వచ్చిందేమో మరి !

Leave a comment