Categories
కిచెన్ గార్డెన్ తప్పనిసరిగా పెంచండి, ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాస్ కంటెయినర్లలో కొత్తిమీర, పాలకూర, ఉల్లి,పుదీనా వంటివి పెంచుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన నిపుణులు. అవసరమైన విత్తనాలు నర్సరీల్లో కొనాలి. లెమన్ గ్రాస్, టమోటో, మిర్చి, అల్లం వంటివి పెంచుకోవచ్చు. సారవంతమైన మట్టితో కుండీలు నింపి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా పెంచిన కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సూర్యరశ్మి పడే ప్రాంతంలో మొక్కలని ఉంచితే చాలు. చాలా కొద్దిపాటి స్థలం లో కూడా ఇంటికి కావలసిన ఆకుకూరలు పండించుకోవచ్చు.