ప్రతి రోజు ఎన్నో పనులు చేసేందుకు చేతులు ఎంతో కష్టపడతాయి చేతులు తరచూ తడిలో పెట్టాలి. ఇంటి పనుల్లో కఠీనమైన క్లీనింగ్ ఉత్పత్తులు నీరు చేతులకు హాని చేస్తాయి. చేతులపై బాక్టీరియా, వైరస్ లు పోయేందుకు నాణ్యమైన హ్యాండ్ వాష్ వడాలి. చేతులు డ్రై గా అనిపిస్తే పగటి పూట పని అయినా సన్ స్క్రీన్ రాయడం, రాత్రి వేళ మాయిశ్చురైజర్ రాసుకోవడం మరచిపోకూడదు. మురికి క్రీములు తొలగించుకోవడానికి తోలి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ కతినమైన రసాయినాలు గల ఉత్పత్తులతో కడిగేస్తే సహజమైన నూనెలు పోతాయి. గోరువెచ్చని నీళ్ళతో మైల్డ్ సోప్ తో కడగాలి. తినే ఆహారం ప్రభావం శిరోజాలు, చర్మం పైనే కాదు, ఇతర శరీర భాగాల పైన కూడా పడుతుంది. విటమిన్-సి ఎక్కువగా వున్న ఆహారం తీసుకుంటే చర్మానికి తగిన తేమ అందింది నిగారిమ్పుగా వుంటుంది.
Categories