Categories
WhatsApp

కొంచం తిన్నా ఎంతో వ్యాయామం చేయాలి.

కొన్ని లిస్టులు చదివితే చివరకు నోరు ఆ అని తెరవలన్నా భయం వేస్తుంది. వేయాలి కూడా. రెండు ముక్కల చీజ్ బర్గర్ తింటే 88 నిమిషాల పాటు పొట్టకు సంబందించిన వ్యాయామం చేయాలని ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ ఒక పొడుగాటి లిస్టు తెచ్చి ఎదురుగ్గా తగిలిస్తే, అవన్నీ ఫాలో అయితే ఇక ఏ వ్యాయామం లేకుండా పుల్ల లాగా అయిపోవచ్చు. సరే లిస్టు చూద్దాం, ఒక్క మిల్క్ షేక్ తాగితే గంట సేపు తాడాట ఆడాలి. మిల్క్ షేక్ లో 786 కేలరీలుంటాయి. చికెన్ ముక్క తింటే రెండు గంటలు నడవాలి. వేయించిన చికెన్ ఫ్రై తింటే రెండు గంటలు ఈత కొట్టాలి. ఉత్త సలాడే కదా అని తినేస్తే 54 నిముషాలు 200 కేలరీలు ఉంటాయట. ఇక ఈ లెక్కన మనం ఎంత తినాలి? ఎం తినాలి? ఏమాత్రం తింటే కెలరీలు చేరుకోనట్లు తినే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి.

Leave a comment