Categories
ఎక్కువగా ఎండలో తిరిగే జాబ్ చేస్తుంటే చర్మం పై ముడతలు ఖాయంగా పడతాయి. సూర్యకాంతి చర్మం పొరల పై ప్రభావం చూపెడుతుంది. చర్మంలో కొలాజెన్ ఎక్కువై చర్మం సాగే గుణాన్ని పొగొట్టుకుంటుంది. చిన్న జాగ్రత్తతో ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఎండలోకి వచ్చే ముందర తప్పనిసరిగా SPF 30-50 ఉన్న సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించటం ఎండపడకుండా క్యాప్ పెట్టుకోవడం చాలా అవసరం. చర్మం పై ముడతలు, ముఖాన్ని అతిగా ఉపయోగించటం వలన అంటే మూతి తిప్పుకోవటం, కళ్లు ఎగరేయడం లేదా కనుబొమ్మలు చిట్లించటం వంటి అవలక్షణాలు కారణంగా కూడా రావచ్చు. మంచి పోషకాహారం శరీరం పట్ల శ్రద్దతో కొంత ముఖ సౌందర్యాన్ని కాపాడుకొవచ్చు.