దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు మంచివేనన్నారు పరిశోధకులు దంపతల మధ్య ఇలా కోట్లాటలు రాకూడదంటారు కొందరు. ఒకళ్ళకి కోపం వస్తే ఇంకోక్కళ్ళు తగ్గాలి. అలా కాకపోతే భార్యా భర్తల సంబందాలు దెబ్బతింటాయాన్నాది నిన్నటి మాట. ఇప్పటి పరిశోధన ఎం చెప్పుతుందంటే, కోపం రాగానే వెంటనే ప్రదర్శిస్తే మనసు లో భారం తగ్గుతుంది. తమ భాగస్వామికి ఏవిషయంలో కోపం అదిమి పెట్టుకుంటే మనస్సులో వత్తిడి తిరేదేలా? కోపం దిగామింగితే దాన్ని పూర్తిగా మనస్సులో నుంచి తోలగించడం చాలా కష్టం. దీని ప్రభావం ఆరోగ్యం పైన పడుతుంది కనుక భార్యా భర్తలు కోపం, చిరాకు, ఏ భావం అయినావ్యక్తం చేసుకోవడమే మంచిది. కానీ అస్తమానం ఇదే పనైతే మాత్రం ఇంట్లో మిగతావాల్లు భరించ లేని పరిస్థితి వస్తుంది కనుక దేన్నయినా మితంగా ఉంచుకోవాలంటే పరిశోధకులు సెలవిచ్చారు.
Categories