Categories
ఓం నమశ్శివాయ
కార్తీక మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రం ఈ రోజు.సోమవారం రావటంతో మరీ విశేషం.శివయ్యకి ఇష్టమైన రోజు మరి ఉపవాసం ఉండి దైవ ధ్యానం చేస్తూ వుంటే ఎంతో పుణ్యం.కార్తీక మాసంలో అందరూ కలిసి వన భోజనం చేయడం,మహాశివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.
ఈ రోజంతా శివనామ స్మరణతో తరించిపోవాలి..ఉదయం,సాయంత్రం శివాలయం దర్శనం చేసుకోవాలి.కార్తీక మాసంలో శివాలయాలు చాలా రద్దీగా ఉంటాయి.పంచామృత అభిషేకం,పండ్ల రసంతో అభిషేకించిన భోళాశంకరుడికి పరమానందం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు
-తోలేటి వెంకట శిరీష