ఐస్ క్రీమ్ అందరి ఫేవరేట్ ఇక వేసవి వస్తే నాకు ఐస్ క్రీమ్ అని అడగని పిల్లలుండరు. పాల మీగడ పంచదారా రుచితో ఉండే ఐస్ క్రీమ్ సీతాఫలం ,కొబ్బరిలతో కలుపుకొని మామిడి ,నేరేడు,జామా, ఖర్జూరం ,ఫైనాఫిల్ వంటి అన్నీ పండ్ల రుచులతోనూ వస్తున్నాయి. అచ్చంగా ఈ పండ్లతోనే చేస్తారు కనుక పండ్ల రుచి ఇంకా ఊరిస్తు ఉంటాయి. అయితే కొత్త ట్రెండ్ ఏమిటంటే రుచిని రుచిగా ఇస్తే సరిపోదు .దానికి మంచి ప్యాకింగ్ కావాలి. ఐచింగ్ అనే కంపెనీ కుక్కపిల్లలు ,పిల్లులు,పూవులు పండ్ల ఆహారంతో ఐస్ క్రీమ్ అందిస్తే ,థాయ్ లాండ్ స్పెషల్ గా చాపలాగా చుట్టి అందించే రకం. సూపర్ మాన్ ఐస్ క్రీమ్, హాల్యా ఐస్ క్రీమ్,ఇవన్నీ ప్రపంచదేశాల నుంచి వచ్చిన ఐడియాలే ఇంకా కొన్నైతే గ్రీన్ టీ తోనూ వెల్లుల్లి మిర్చి తిన్నట్లు కూడా ఐస్ క్రీమ్ రుచిని మార్చేసి, ఇంకా ఐస్ క్రీమ్ లు కాక ఇంకేం తింటాం అని పిస్తున్నాయి.

Leave a comment