తాజా పరిశోధనల్లో మనిషి మూడ్ మార్చగలిగే శక్తి పసుపులో ఉందని తేల్చారు పరిశోధకులు. పసుపులో కిర్క్ మన్ అనే మూలకానికి యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దినీ ప్రభావం జ్ణాపకశక్తి ఇబ్బందులు మొదలవుతున్న వారి పైన ఎలా ఉంటుంది అనే విషయం పై పరిశోధన జరిగింది. రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున 18 నెలలపాటు పసుపును ఆహరంలో భాగంగా ఇచ్చారు. జ్ణాపకశక్తి కి ఇబ్బంది కలిగించే అల్జీమర్స్ సంబంధం ఉన్న ప్రోటీన్ స్థాయిని గమనిస్తే పసుపు తీసుకున్న వారిలో గణనీయంగా జ్ణాపకశక్తి మెరుగైనట్లు గమనించారు. గతంలో కన్నా 20 శాతం అధికంగా విషయాలను గుర్తుపెట్టుకుంటున్నారని తేలింది. పసుపు వాడకం ఏ రకంగా చూసినా మంచిదే అని తేల్చాయి అధ్యాయనాలు.

Leave a comment