ఇప్పుడు రెగ్యులర్ గా వేసుకునే డ్రస్సులే ఇంకాస్త కొత్తగా ఆధునికంగా కనిపించాలనుకోంటే కాంబినేషన్స్ మార్చుకొంటే సరిపోతుంది. సల్వార్లు, కుర్తీలు, లెగ్గింగ్స్ వేసుకుంటారు సాధారణంగా. అయితే విభిన్నంగా కనిపించాలనుకుంటే పొడవాటి కుర్తీలకు జతగా లెగ్గింగ్స్, కుర్తీలలో కలంకారీ, రాజస్థాన్, బొలెరోలు మల్టీకలర్ జాకెట్స్ వంటివి చాలా బావుంటాయి. ఇక కుర్తీలు, టాప్ లు చేతుల్లెకుండా వున్నవి తీసుకుని పైన కేప్ జత చేస్తే బావుంటుంది. సౌకర్యంగా సాంప్రదాయకం గానూ వుంటుంది. ప్రింటెడ్ కుర్తీలు తీసుకుని షిఫాన్ కేప్ వేసుకుంటే బావుంటుంది. కాజువల్ డ్రస్ లానే కొంటే డిఫరెంట్ గా ఎంచుకుంటే కొత్త లుక్ తీసుకోవచ్చు.

Leave a comment