కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్ కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి రుతుస్రావం తగ్గాలంటే కొత్తిమీర కంటే ధనియాల కాషాయం తీసుకోవటం చాలా మంచిది. పల్చని మజ్జిగ లో కొత్తి మీర రసం జీలకర్ర కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. కోతి మీరాను శుభ్రం చేసి ముక్కలుగా తరిగి గిన్నెలో నీటిలో బాగా ఉడకనివ్వాలి. చల్లారాక వడకట్టి ఈ కషాయం సీసాలో పూసి ఫ్రిజ్ లో ఉంచవచ్చు. ఈ రసం కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది/ కొత్తిమీరతో కూరలకు రుచి వస్తుంది. కొత్తిమీర పచ్చడి తో ఉదయపు ఫలహారం ముగిస్తే ఎంతో ఆరోగ్యం. ఫ్రెష్ గా దొరికే ఈ కొత్తిమీర ను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
Categories