Categories
గణిత సూత్రాలను అర్థం చేసుకుంటే లెక్కలంతా తేలిక ఇంకేది కాదు అంటారు సుజాత రామ్ దొరై.అన్నామలై యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదువుకున్న సుజాత ప్రస్తుతం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా లో ప్రొఫెసర్. నంబర్ థియరీ విభాగంలో జపాన్ గణిత శాస్త్రవేత్త ఇవాసావా థియరీ పైన పరిశోధనలు చేస్తున్నారు.ఆమెకు గణితంలో రామానుజం ప్రైజ్ 2006 ,క్రిగెర్-నెల్సన్ అవార్డు 2020 పద్మశ్రీ అవార్డు 2023 లభించాయి. పిల్లలకు బాల్యంలోనే గణితం పై ఆసక్తి కలిగించాలి అందుకు వాళ్లని ప్రోత్సహించండి అంటారు సుజాత రామ్ దొరై .