Categories
ఉదయాన్నే నిద్ర లేస్తూనే హుషారుగా అనిపించాలంటే శ్రావ్యమైన సంగీతం వినిపించే అలారం పెట్టుకొని ఆ సంగీతపు పలకరింపుతో నిద్ర లేవండి. బద్ధకం నీరసం అన్నీ ఎక్కడికక్కడ పారిపోతాయి అంటున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. నిద్రలేవగానే చురుగ్గ పని చేయవలసిన అవసరం ఉన్న షిఫ్ట్ కార్మికులు దగ్గర నుంచి భూకక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమ గాములు వరకు ఉదయాన్నే లేవగానే ఒక నిర్లిప్తత బద్ధకం వెంటాడుతోందంటూ ఉంటారు. ఎన్నో పరిశోధనల తరువాత చెవికి ఇంపైన సంగీతం వింటూ మేల్కొంటే ఆ సంగీతపు తరంగాలు మనసులో ఒక ఆశసహమైన ఆలోచన కలిగిస్తుందని పరిశోధికులు కనుగొన్నారు.