గాలి తెమ్మెర తాకెనా, పువ్వు విరిసినా సంతోషంతో పొంగిపోయే యువతరం కోసం ఎన్నెన్నో సంబరాలు ఉంటాయి. పదిమంది కలిస్తే ఏ వేడుకను వాళ్ళు వదలరు. జపాన్ లో దేశవ్యాప్తంగా యుక్త వయసు సంబరాలు జరుగుతాయి. ఇరవయ్యో వసంతం లోకి అడుగు పెట్టిన యువతీ యువకులు యవ్వనాన్ని స్వాగతిస్తూ కమింగ్ ఆఫ్ ఏజ్ డే ఉత్సావాలు జరుపుకొంటారు. ఈ యుక్త వయసు సంబరాలు విశ్వవిద్యాలయాల్లో ఎంతో ఘనంగా జరుగుతాయి. యువతీ యువకులు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై ఎంతో కోలాహలంగా ఈ వేడుకను జరుపుకుంటారు.

Leave a comment