Categories
పుస్తకాలంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ,ఎన్నో అలంకరణ సామాగ్రి కంటే పుస్తకాలే ఇంటికి అందం అనుకొనే వాళ్ళు లక్షల్లో ఉంటారు . అయితే పుస్తకాలకు కూడా ఒక లైఫ్ టైమ్ ఉంటుంది . ఎంత శ్రద్దగా కాపాడిన వాటిలో దుమ్ము ధూళి పేరుకొంటూ ఉంటుంది . కాలగమనంతో పుస్తకాల ,కాగితాల రంగు మారుతుంది . పురుగులు వచ్చేస్తాయి కూడా . వాటిని ఎప్పటికప్పుడు దుమ్ము దూళి లేకుండా శుభ్రం చేస్తే ఎంతోకాలం పాడైపోకుండా ఉంటాయి . అలా పుస్తకాలను నీట్ గా ఉంచేందుకు స్వీడిష్ సంస్థ క్లారిడీ ఒక బుక్ శానిటైజర్ ను రూపొందించింది . దుమ్ము పట్టిన పాతబడిన పుస్తకాల ఇందులో ఉంచి స్విచాన్ చేస్తే చాలు ముప్పయ్ సెకండ్లలో పుస్తకాలు దుమ్ము లేకుండా శుభ్రం అయిపోతాయి . ఎంత కాలమైనా కొత్త బుక్స్ లాగా ఉంటాయి .