అచ్చం చింత పండు రుచితో వుండే బ్లాక్ వెల్వెట్ చింత లో విటమిన్ -సి,ఎలు,ఫోలిక్ ఆమ్లా ,నియాసిన్,రిబో ఫ్లేవిన్ వంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి ఆగ్నేయసియా,ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్టుకు కాసే పండు లో  పండిన తర్వాత పై పెంకు రాలి పోతుంది. గుజ్జు తియ్యని చింత పండు రుచి తో ఉంటుంది ఈ పండు తో పాటు చెట్టు ఆకులు,బెరడు కూడా అనేక వ్యాధుల నివారణ లో పనికివస్తాయి. ముఖ్యంగ శ్వాసకోశ వ్యాధులకు ఈ పండ్లు మంచి మందుల ఉపయోగపడతాయి వీటిలోని పొటాషియం బిపి,మధుమేహాలను తగ్గిస్తుంది పాలు తక్కువగా వుండే గర్భిణీల్లో ఈ పండ్లు పాలుపడేలా చేస్తాయి ఈ చెట్టు ఆకు కాషాయం మలేరియాకి మంచి మందు.

Leave a comment