కోహినూర్ వజ్రం మన దేశం లోనే కృష్ణాతీరంలో దొరికింది అంటారు చరిత్రకారులు. దాన్ని మొదట్లో శమంతకమని అని అన్నారు. 11 వ శతాబ్దంలో పర్షియన్ భాష లో కోహినూర్ అంటే కాంతి శిఖరం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఆ కాలానికి ప్రపంచంలో అతి పెద్ద వజ్రం అదే 1849 లో ఈస్టిండియా కంపెనీ దాన్ని సొంతం చేసుకొని 1851లో బ్రిటిష్ రాణి కి బహూకరించారు. అప్పటికి అది 186 క్యారెట్ల వజ్రం. మరో రెండు వేల ఇతర వజ్రాలతో పాటు దాన్ని తన కిరీటంలో పొదిగించుకుంది బ్రిటిష్ రాణి. మా వజ్రం మాకు ఇమ్మని భారతదేశం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Leave a comment