కొన్ని రకాల బాక్టీరియా లు యాంటీ బయోటిక్స్ వాడిన ఒక పట్టాన లొంగవు . ముఖ్యంగా హెలికో బాక్టెర్ పైలోరి అనే బాక్టీరియా మీద ఎలాంటి యాంటీ బయోటిక్స్ కూడా పని చేయటం లేవు . ఇది పొట్టలోని లోపల గోడలకు అంటుకొని యాంటీ బయోటిక్స్ కు లొంగకుండా దాక్కొంటుంది. దానితో బ్రిటన్,జర్మన్ శాస్త్రవేత్తలు ,కుర్కువామిన్ ను నానో క్యాప్యూల్స్ రూపంలో తయారుచేసి ,ఈ బాక్టీరియాను నిరోధించ గలిగారు . ఈ రసాయనాలతో తయారైన కుర్కువామిన్కంటే సహజమైన పసుపు లో ఉండే కుర్కువామిన్కూడా బాక్టీరియాను నిరోధించగలదని శాస్త్రజ్ఞులు తేల్చారు . ఇప్పుడు పసుపు తోనే యాంటీ బయోటిక్స్ ని తయారు చేసేదిశగా పరిశోధనలున్నాయి . ఎలా చూసినా కాస్త పసుపు నోట్లో వేసుకొంటే మంచిదే నని తేలిపోయింది .

Leave a comment