తినే ఆహారం నోటికే కాదు మెదడుకీ రుచిస్తే అది చక్కగా పని చేసి జ్ఞాపక శక్తిని కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు. కూరగాయలు. ఆకు కూరలు,బెర్రీలు,నట్స్,తృణ ధాన్యాలు చేపల తో కూడిన ఆహారం తీసుకొనే వాళ్ళలో మతి మరపు చాలా తక్కువగా ఉండటం తో పాటు వారి ఆలోచన శక్తి కూడా బాగా ఉంటుందని సర్వేలు నిరూపించాయి.పిండి పదార్ధాల్లో,బంగాళాదుంపలు,కుకీలు,స్నాక్స్ తినే వాళ్ళలో అల్జీమర్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాంసా హారంతో పండ్లు,కూరలు,సీఫుడ్స్ జోడించి తినే వాళ్ళలో మతిమరుపు తక్కువగా ఉంది. ఆహారం తో ఆరోగ్య పరమైనవి ఎక్కువగా ఉంటే మెదడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

Leave a comment