అరవై ఐదు,అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్దులు 40 శాతం మంది కింద పడటం వల్ల గాయపడటం,లేదా ఆ గాయాలు ఎంతకీ తగ్గక మరణించటం సంభవిస్తోందని పరిశోధికులు చెపుతున్నారు. వీటిని నివారించేందుకు వృద్దులు నివసించే ఇళ్ళలో సోఫాలు టేబుళ్ళు నడిచే దారిలో అడ్డంగా కాకుండా గోడలకు దగ్గరగా ఉంచాలంటున్నారు. కార్పెట్ తట్టుకొని పడిపోకుండ సరిగ్గ వుండేలా చూడాలి. ఫ్లోర్ తడిగా,జారిపోయేలా ఉండకూడదు బాత్ రూమ్ చేత్తో పట్టుకొని నడిచేందుకు వీలుగా గోడలకు హాండ్ రెయిల్స్ ఉండాలి. నేలపైన జారని మ్యాట్ ఉండాలి. ఇళ్ళల్లో గాలి వెలుతురు చక్కగా రావాలి. ఎవరేనా వృద్దులు పడిపోతే వేంటనే చికిత్స అందించే ఏర్పాట్లు ఉండాలి.

Leave a comment