లింగన్  బెర్రీల రసం అధిక బి. పి తో  బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందని హెల్సింకీ విశ్వవిద్యాలయ నిపుణులు చెపుతున్నారు . ఉత్తరా ఖండ్ లో ఎక్కువగా పండే  ఈ బెర్రీలుమాత్రమే కాదు ,నల్లద్రాక్ష క్రాస్ బెర్రీల్లో పుష్కలంగా ఉండే పాలిఫినాల్స్ హృద్రోగాలతో పాటు బి. పి నీ తగ్గిస్తాయని గుర్తించారు . ఎనిమిది నుంచి పదివారాల పాటు పాలిఫినాల్స్ ఎక్కువగా ఉండే ఈ జ్యుస్ తాగిన వాళ్ళలో రక్త ప్రసరణ లో తేడా కనిపించింది . అయితే ఈ లింగన్ బెర్రీల రసం తగిన వాళ్ళలో బి.పి బాగా తగ్గింది . ఈ రకమైన బెర్రీలు నేరుగా దొరకని పక్షంలో కోల్డ్ ప్రెస్డ్ డ్రింక్ రూపంలో తీసుకొన్నా మంచిదే అంటున్నారు నిపుణులు . బీట్ రూట్ రసంలాగే ఈ బెర్రీల రసం కూడా బి.పి తగ్గిస్తుంది .

Leave a comment