చర్మంపైన కొవ్వు కణాలు మృతకణాలు పేరుకొని ఆ భాగం నల్లగా బిరుసుగా అనిపిస్తుంది. నడుము కింద భాగం లో తొడలపైనా ఈ సమస్య కనిపిస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఆ సమస్య ను అధిగమించవచ్చు. ఫిల్టర్ లో వేసే బరక వంటి కాఫీ పొడిని ఓ టేబుల్ స్పూన్ తీసుకొని నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ ను నల్లబడిన శరీర భాగం పైన వేసి మర్దన చేయాలి. ఇలా చేస్తే కొవ్వుకణాలు మృత కణాలు రాలిపోతాయి. చర్మం శుభ్రం పడుతోంది. యాంటీ సెల్యులైట్ మసాజ్ ఆయిల్ ను తీసుకొని ఒంటికి పట్టించి మసాజ్ చేస్తే మృతకణాలు పోయి మేని ఛాయ కాంతివంతంగా ఉంటుంది శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగవుతోంది.

Leave a comment