నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా…. ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా……. సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని చెప్పుల పైన గడ్డి మొలిచినట్లు కనిపించే జత వేసుకోవచ్చు. ఈ యూనిక్ డిజైన్ లు ఇవ్వాల్టి లేటెస్ట్ ఫ్యాషన్. అప్పుడే ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. లెక్కలేనన్ని రకాల అరటి పండు తొక్కలు, కుక్క తోకలు, కాట్ బాల్స్ అనుకోండి. అన్నీ చెప్పులే!

Leave a comment