Categories
తులసి గురించి ఇంకా పరిశోధనలు ఆగనట్లే, ఈ మధ్య వచ్చిన ఒక పరిశోధన సారంశం తులసిలో పద్నాలుగు రకాల ములకాలను ఉత్పత్తి చేసే జన్యువులు వేరు చేసి గుర్తించారట. వీటిలో కాన్సర్ నిరోధించేవి 8 ఉండగా ఫంగస్ ను చంపే గుణం ఉన్నవి మరో 6 గుర్తించారు. గుండెకు రక్షణ ఇచ్చేది గాను సెప్టిక్ ను నిరోధించేందుకు తులసి పవర్ ఫుల్ గా పని చేస్తుందంటున్నారు. మొత్తం తులసి చెట్టులో అన్ని భాగాల్లో ఔషధ గుణాలు ఉండగా లేత ఆకుల్లో ఔషధ గుణాలు మూలకాలు తయారవుతున్నందున ముదురు ఆకుల్లో ఇవి ఉంటాయని కనుగొన్నారు. లేత ఆకులు తినే జీవులు నుంచి కాపాడుకునేందుకు వాటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయన్నారు. ప్రతి రోజు రెండు లేత ఆకులు నమిలితే ఎంతో ఆరోగ్యం అంటున్నారు.