తినటం కష్టం పైగా రుచి పచి ఉండదు కాని పచ్చి కూరల్లో ఉండే పోషకాలను తెలుసుకుంటూ ఎలాగో అలా తినండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  కూరగాయల్లో ఆకు కూరల్లో ఉండే సీ విటమిన్ కీలకమైన ఎంజైమ్.  అరుగుదలకు ఎంతో ప్రయోజనం.  తక్కువ ఉష్ణోగ్రతలో నీళ్లతో కూరగాయలు వండుకోవాలి.  ఆ కూరగాయలను ఉడకబెట్టిన నీటితో నూడిల్స్ వండుకోవచ్చు లేదా సూప్స్ చేసుకోవచ్చు,  పచ్చి కూరల్లో ఉండే మైకో సీపెజ్ అనే ఎంజైమ్ కాన్సర్ ను తెచ్చిపెట్టే కార్సినో జైన్స్ ను తగ్గించగలుగుతుంది.  టమాటోల్లో ఉండే లైకోసిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  గుండెకు పూర్తి ఆరోగ్యాన్నిస్తుంది.  కానీ దేన్నైన పచ్చిగా తింటేనే ఉపయోగం.

Leave a comment