ఆరోగ్య నిర్ధారణ చర్యలో భాగంగా గోళ్ళు, నాలుక పరీక్ష చేస్తారు ఇపుడు కనుక గోళ్ళు లేత గులాబీ వర్ణం లో కాకుండా తెల్లగా పాలి పోయి విరిగినట్లుగ అనిపిస్తే, వాటి పై అక్కడక్కడా గీతాలు కనిపిస్తే శరీరంలో కీలకమైన విటమిన్లు, ఖనిజాలు తక్కువగా వున్నాయని అర్ధం. ఈ సమస్య నుంచి వుప్పసమనం పొందాలంటే గింజలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లీలు బాదాం పప్పు, పిస్తా, జీడిపప్పు, వంటి వాటిలో శరీరానికి అవసరమైన కొవ్వు, విటమిన్లు ఉంటాయి. గుడ్లు, గింజలు, కురగాయాల్లో బియోటిన్ పోషకం వుంటుంది. వారంలో మూడు రోజులు చేపల్ని తినొచ్చు. పాలు, పాల పదార్ధాలలో మంసాకృతులు కాల్షియం ఉంటాయి. వీటితో గోళ్ళ ఆరోగ్యంగా మారిపోతాయి. ఆకుకూరలు కాషాయ రంగులో వుండే కాయగూరలు పండ్లురిసుకుంటే ఇందులో విటమిన్ ఎ ఫోలిక్ యాసిడ్ గోళ్ళు ఆరోగ్యంగా పెలసుబరకుండా ఉండేలా చేస్తాయి.
Categories