Categories
చలి గాలులు వీస్తున్న సమయం కనుక అన్ని రకాల సౌందర్య సాధనాలు కన్నా గోరువెచ్చని నూనెతో ముఖానికి శరీరానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా ఉండటంతోపాటు నిగనిగలాడుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె ఈ ప్యాక్ కోసం వాడవచ్చు మనకు నచ్చిన ఆయిల్ ని చిన్న గిన్నెలో తీసుకుని దాన్ని నేరుగా వేడి చేయకుండా వేడి నీళ్ళు గిన్నెలో ఉంచి జాగ్రత్త గా వేడిచేయాలి కావాలనుకుంటే ఇందులో వేప లేదా తులసి ఆకులు వేసుకోవచ్చు. ఈ నూనెతో శరీరం మసాజ్ చేసుకొని తర్వాత ఏదైనా హెర్బల్ బాత్ పౌడర్ తో నలుగు పెట్టుకుని స్నానం చేస్తే శరీరం మెరుపుతో ఉంటుంది.